తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు మరోసారి మహారాష్ట్రకు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. కొల్హాపూర్ లో ఉన్న మహలక్ష్మీ అమ్మవారిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. అయితే 10:30కి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు బయల్దేరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: కల్వకుంట్ల కవితను ఇన్‌స్పైర్ చేసిన తల్లీకూతుళ్లు..
కాగా అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని కోరికలు కోరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం సీఎం తిరిగి హైదరాబాద్ రానున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.