సాధారణంగా రాజకీయాల్లో నాయకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా గానీ సెక్యూరీటి లేనిదే అడుగు బయటపెట్టరు. పటిష్టమైన సెక్యూరీటి ఉన్నప్పటికి కూడా సదరు రాజకీయ నాయకులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మనం గతంలో చాలానే చూశాం. తాజాగా సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రిపైనే కాల్పులకు తెగపడ్డాడు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్. ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబాకిషోర్ దాస్ పై ఆదివారం కాల్పులు జరిపాడు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబాకిషోర్ దాస్ పై కాల్పులు జరిపాడు సబ్ ఇన్ స్పెక్టర్ గోపాల్ చంద్ర దాస్. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు నబాకిషోర్ దాస్. దాంతో వెంటనే ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఝుర్పుగూడ జిల్లాలోని బ్రెజిరావ్ నగర్ లో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో గాంధీ చౌక్ వద్ద నబాకిషోర్ పై దగ్గరి నుంచి ఛాతిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులకు సంబంధించి కారణాలు తెలియల్సి ఉందని పోలీసులు తెలిపారు. నడి రోడ్డులో మంత్రిపై కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో బీజేడీ కార్యకర్తలు, నాయకులు ధర్నాకు దిగారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి పరిస్థితి సిరీయస్ గానే ఉందని వైద్యులు తెలిపారు.
అందరూ చూస్తుండగా మంత్రిని కాల్చిన పోలీస్!! pic.twitter.com/awQhcE4Urx
— venky bandaru (@venkybandaru13) January 29, 2023