Hindupuram: ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా, ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో ఓ వైద్య సేవల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనం నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. అయితే, ఈ వాహనమే రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ రథంపై కేవలం బాలయ్య, ఎన్టీఆర్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బొమ్మ వాహనంపై లేదు. ఇదే ఇటు ఏపీ రాజకీయాలతో పాటు, టీడీపీలోనూ చర్చకు దారి తీసింది. బావను పక్కన పెట్టేశారని కొందరు..
లేదు, లేదు అది బాలయ్య రథం కాబట్టి తండ్రి ఫొటోను మాత్రమే పెట్టుకున్నాడని మరికొందరు.. ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తున్నారు. కాగా, ఈ వాహనం రోజుకో గ్రామంలో సేవలు అందిస్తోంది. దాదాపు 200లకు పైగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు వైద్యుల సంప్రదింపులు, ఆరోగ్య అవగాహన సదస్సులు, మాతా శిశు సంరక్షణ గ్రామాల్లోనే ఏర్పాటు చేసే విధంగా ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇక, ఈ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథంలో ఒక డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్, ఆరుగురు వైద్య సిబ్బంది, మందుల కౌంటర్, కంప్యూటర్ ఆపరేటర్ కూడా అందుబాటులో ఉన్నారు. సాధారణ జబ్బులకు అక్కడే వైద్యం చేసి ఉచితంగా మందులు ఇస్తున్నారు. పెద్ద జబ్బులను పెద్ద ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ వాహనాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి, ఎన్టీఆర్ ఆరోగ్య రథంపై చంద్రబాబు బొమ్మ లేకపోవటంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nara Lokesh: వచ్చే వారం ఓ సంచలనాన్ని బయటపెట్టబోతున్నాను: నారా లోకేష్