మన దేశంలో సినిమాని, రాజకీయాన్ని వేరు వేరుగా చూడలేము. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు రంగాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. పరస్పరం సహకరించుకుటూ ఇన్నాళ్లు ఈ రెండు రంగాలు ముందుకి నడిచాయి. ఈ కారణంగానే సినీ రంగంలో ఉన్న లోపాలు, లోటుపాట్లపై ఇన్ని రోజులు ఎక్కడా చర్చ జరగలేదు. ఎవ్వరూ దీనిని ప్రశ్నించలేదు. దర్శక రత్న దాసరి నారాయణరావు బతికి ఉన్న రోజుల్లో టికెట్స్ రేట్లపై, అదనపు షోలపై, ధియేటర్స్ పై కొంతమేర గళం విప్పినా ఆయన వాదనని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ.., ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మొట్ట మొదటిసారిగా ఈ తేనె తొట్టిని రాయితో కాకుండా, ఏకంగా బండ రాయితో కొట్టి కదిలించేశారు. ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ జీవో 35 ని తీసుకొచ్చిందో అప్పటి నుండి రచ్చ మొదలయింది.
Movie Ticket prices in both states#AndhraPradesh #Telangana
👇 👇 pic.twitter.com/MMhWkFePq3— JuStLiKeThAt (@ItsMineOnly_) December 30, 2021
ఈ జీవో ప్రకారం సినిమా టికెట్ల రేట్లు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆ టికెట్స్ ని కూడా ప్రభుత్వమే విక్రయిస్తుంది. పైగా.. కొత్త సినిమాలకైనా, పాత సినిమాలకైనా ఒక్కటే రేటు, పెద్ద సినిమాలకైనా, చిన్న సినిమాలకైనా ఒక్కటే రేటు. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో ఏ ధియేటర్ లో అదనపు షోలు వేయడానికి వీలు లేదు. ఈ జీవో ప్రకారం ఇప్పుడు ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.250 కాగా, అత్యంత కనిష్టంగా రూ.15 ఉంది. అంటే.. ఇది వరకు ఉన్న రేట్లతో పోలిస్తే చాలా వరకు ధరలు తగ్గిపోయాయి.
వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని రావడంతో సినీ జనాలు అంతా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం స్టార్ట్ చేశారు. కిరాణా కొట్ల కామెంట్స్ ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సిద్దార్ద్ లాంటి పక్క రాష్ట్రం హీరోలు కూడా ఏపీ ప్రభుత్వంపై సెటైర్స్ పేల్చారు. ఇంకా విచిత్రం ఏమిటంటే సోషల్ మీడియాలో మీమ్స్ పేజెస్ కూడా సినీ పరిశ్రమ తరుపున చొక్కాలు చించేసుకుంటూ, గుండెలు బాదేసుకుంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెగ పోస్టింగ్స్ చేసేశారు. కానీ.. ఎన్ని విమర్శలు ఎదురైనా, మన సో కాల్డ్ స్టార్స్ ఎందరు ఎన్ని మాటలు అంటున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్ల విషయంలో సామాన్య ప్రేక్షకుల జేబులకి చిల్లు పడకుండా చూడాలనే నిర్ణయించుకుంది. ఆ స్టాండ్ మీదే గట్టిగా నిలబడింది. అయితే.. ఏపీలో జరుగుతున్నఈ రచ్చ అంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి రెండో వైపు ఉండే బొమ్మ తెలంగాణలో స్టార్ట్ అయ్యింది.
@KTRTRS Sir and @YadavTalasani Sir please try to reduce the new movie ticket prices in Telangana, common people like me can’t go into Multiplex’s if new prices as it be. #TicketRates #Hyderabad #cinema #Tollywood pic.twitter.com/rbpuYR3aWn
— Upender Sangishetti (@upender_s819) December 31, 2021
తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్ రేట్లు పెంచుకునే వీలు కల్పించింది. అంటే.. ఇప్పటికే అధికంగా ఉన్న టికెట్స్ రేట్లకి ఇంకా అదనపు పెంపు అన్నమాట. ఈ నిర్ణయం కారణంగా.. మల్టీ ప్లెక్స్ లలో టికెట్ ధర 300 రూపాయిలకి చేరింది. జీఎస్టీ ఇందుకు అదనం.ఇక ఇక్కడ కనిష్ట ధర కూడా 100 రూపాయిలు ఉండటం విశేషం. కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న సినీ ఇండస్ట్రీ కోలుకోవాలన్న ఉద్దేశ్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ ఆలోచనలో ఎలాంటి తప్పు లేదు. కానీ.., ప్రజల రియాక్షన్ లో మాత్రం రెండు ప్రాంతాల్లో తేడాగా ఉంది.
నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఓ కుటుంబం ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అంటే.. ఏపీలో 300 నుండి 400 ఖర్చు అవుతుంటే.., తెలంగాణలో ఇదే ఖర్చు 800 నుండి 1000 రూపాయలు అవుతోంది. దీంతో.. ఏపీలో టికెట్స్ రేట్లని తగ్గించినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారే.. ఇప్పుడు టికెట్స్ రేట్లు పెంచినందుకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా సో కాల్డ్ మీమ్స్ పేజెస్ ధోరణి కూడా ఇలానే ఉంది.
ఈ లెక్కన టికెట్ ధరలు తగ్గించిన సీఎం జగన్ చెడ్డ అయితే.. టికెట్స్ ధరలు పెంచిన కేసీఆర్ మంచి అవ్వాలి కదా? అన్నదే ఇక్కడ పాయింట్. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నపుడు.. రెండిట్లో ఏదో ఒకటి మంచి అవ్వాలి గాని, ఇలా రెండు నిర్ణయాలను ఎందుకు తప్పు పడుతున్నట్టు? ఇక్కడ తప్పు ఎవరిది? టికెట్స్ రేట్లు పెంచేశారు అని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న వారిదా? టికెట్స్ రేట్లు తగ్గించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలబడని వారిదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.