టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 63వ రోజుకి చేరుకుంది. 63వ రోజు పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోని మార్తాడా విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 63వ రోజుకి చేరుకుంది. 63వ రోజు పాదయాత్ర శింగనమల నియోజకవర్గం కొనసాగింది. నేడు శింగనమల నియోజకవర్గంలోని మార్తాడు విడిది కేంద్రం నుంచి యువగళ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా విడిది కేంద్రంలో 1000 మందికిపై అభిమానులకు లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. మార్తాడా విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది.
నేడు మార్తాడా క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యాత్ర శింగనమల నియోజకవర్గంలో సాగింది. ఇక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో 800 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా శిలాఫలకాన్ని నారా లోకేశ్ ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చీనీ పండ్ల ప్రాసెంసింగ్ యూనిట్ నెలకొల్పుతామని ఆయన హామి ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సాయంతో చదువుకుని ఉద్యోగం చేస్తున్న మౌనిక అనే యువతి నారా లోకేశ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
గార్ల దిన్నెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగించారు. అలానే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్రలో గంజాయి వద్దు అంటూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ క్యాంపెయిన్ చేశారు. యువత అంతా డ్రగ్స్, గంజాయి కి దూరంగా ఉండాలి అని పిలుపు ఇస్తున్నామని, అలానే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ గంజాయి మాఫియా పై చర్యలు తీసుకుంటామని లోకేశ్ అన్నారు. మరి.. 63వ రోజు లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.