టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 60వ రోజుకి చేరుకుంది. 60వ రోజు పాదయాత్ర రాప్తాడు యోజకవర్గంలోని పంగల్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 60వ రోజుకి చేరుకుంది. 60వ రోజు పాదయాత్ర అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పంగల్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. పంగల్ విడిది కేంద్రం వద్ద తనను కలవడానికి వచ్చిన యువత, అభిమానులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. తన కోసం వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు రాప్తాడులో నియోజవర్గంలో ప్రారంభమైన పాదయాత్ర అనంతపురం అర్బన్ లోకి ప్రవేశించింది.
ఈ నేపథ్యంలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అలానే టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి భారీగా కార్యకర్తలతో తరలివచ్చి స్వాగతం పలికారు. ఇదే సమయంలో నారా లోకేష్ అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతపురం విజయనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..”అనంతపురం విద్యావంతులకు పుట్టినిల్లు. రాజకీయ చైతన్యానికి మారుపేరు అనంతపురం. ఎస్కే యూనివర్సిటీ, సత్యసాయి యూనివర్సిటీ లను పోరాడి సాధించుకున్న చరిత్ర అనంతపురం ప్రజలది.
ఎస్కే యూనివర్సిటీ లో చదువుకున్న దళిత నేత దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఎస్కే యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఎదిగారు. ఎస్కే యూనివర్సిటీ లో చదువుకున్న నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి గా ఎదిగారు. అంతటి ఘన చరిత్ర ఉన్న అనంతపురం లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం” అని లోకేశ్ అన్నారు. మరి.. 60వ రోజు లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.