టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజుకి చేరుకుంది. 54వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని నలగొండ్రాయపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజుకి చేరుకుంది. 54వ రోజు పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి సమీపంలోని నలగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి.. వారికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. నలగొండ్రాయనపల్లి విడిది కేంద్రం తనను కలవడానికి వచ్చిన యువతీ, యువకులు, అభిమానులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. విడిది కేంద్రంలో తన కోసం వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలోకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు.
ఈ యువగళం పాదయాత్ర నేటితో 54వ రోజుకు చేరుకుంది. 54వ రోజు పాదయాత్ర సోమందేపల్లి మండలం నలగొండ్రాయనపల్లి పల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభం అయింది. 54వ రోజు యాత్ర ప్రారంభంలోనే బ్రాహ్మణ సామాజిక వర్గీయులతో లోకేశ్ భేటి అయ్యారు. అనంతరం ముందుకు సాగిన లోకేశ్ సోమందేపల్లి దళితవాడలో ఎస్సీ వర్గీయులతో సమావేశం అయ్యారు. అనంతరం మహిళలతో, చేనేతలతో సమావేశం అయ్యారు. పెనుకొండ మండలం వెంకటాపురం తండాలో స్థానికులను లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో వ్యాపారులతో లోకేశ్ బాబు సమావేశం అయ్యారు. అదే సెంటర్‌లో కురుబ సామాజిక వర్గీయులతో కూడా లోకేశ్ సమావేశమై..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తామో లోకేశ్ వివరించారు. మరి.. 54 రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.