టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 52వ రోజుకి చేరుకుంది. 52వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని రెడ్డి చెరువు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 52వ రోజుకి చేరుకుంది. 52వ రోజు పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని కొండాపురం పంచాయతీ రెడ్డి చెరువు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. క్యాంప్ సైట్ వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి.. వారికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. క్యాంప్ సైట్ వద్ద ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి లోకేశ్ సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రెడ్డి చెరువు విడిది కేంద్రం వద్ద తనను కలవడానికి వచ్చిన యువతీ, యువకులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ యువగళం పాదయాత్ర నేటితో 52వ రోజుకు చేరుకుంది. 52వ రోజు పాదయాత్ర రెడ్డి చెరువు విడిది కేంద్రం నుంచి ప్రారంభం అయింది.
పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ కు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అలానే గోరంట్ల జనసంద్రంగా మారిపోయింది. లోకేష్ ని చూసేందుకు ప్రజలు రోడ్ల పైకి భారీగా చేరుకున్నారు. అలానే మరికొందరు చుట్టూ ఉన్న భవనాల పైకి ఎక్కారు. అందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ నారా లోకేష్ ముందుకు సాగారు. అలానే మధ్య మధ్యలో తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులతో లోకేశ్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జినబండ్లపల్లిలో నాయి బ్రాహ్మణులతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. వారు తమ సమస్యలు వివరించగా.. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో లోకేశ్ వారికి వివరించారు. అలానే గోరంట్ల లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు. అలానే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు అవినీతికి పాల్పడుతున్నారని, బీసీలను అణగతొక్కేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. మరి.. 52 రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.