టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్‌కి గాయం అయ్యింది. వైద్యులు ఆయనకు స్కానింగ్ తీశారు. ఆ వివరాలు..
టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు.. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల మేర పర్యటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. అయితే పాదయాత్ర ప్రారంభమైన కొన్నాళ్ల తర్వాత నారా లోకేష్ గాయపడిన సంగతి తెలిసిందే. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సమయంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయం అయ్యింది. అది ఇంకా పూర్తిగా మానలేదు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ భుజం నొప్పితోనే పాదయాత్రలోనే పాల్గొంటున్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న నేపథ్యంలో.. నారా లోకేష్‌కు నగరంలోని మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో కుడి భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు వైద్యులు.
50 రోజులు దాటినప్పటికి.. నారా లోకేష్ భుజానికి అయిన గాయం తగ్గకపోవడంతో.. స్కాన్ చేయించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆయనకు నంద్యాలలో స్కానింగ్ తీశారు వైద్యులు. ఇక కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో కూడా గాయం కారణంగా లోకేష్ కాస్త ఇబ్బందిపడుతూ కనిపించారు. ఇక యువగళం పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం ఉండేది.. లోకేష్ స్వయంగా సెల్ఫీ తీసేవారు. కానీ భుజం నొప్పి కారణంగా కొన్ని రోజులుగా ఫోటోగ్రాఫర్ సాయంతో ఫోటోలు తీస్తున్నారు. భుజం నొప్పి బాధపెడుతున్నా సరే.. ఫిజియోథెరపీ చేయించుకుంటునే యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకేష్.
మరోవైపు లోకేష్ బుధవారం నంద్యాల రాజ్ థియేటర్ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వంలో నంద్యాల నేరాలకు అడ్డాగా మారిందని.. నడిరోడ్డుపై 15 హత్యలు జరిగాయని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కలిసి భూకబ్జాలు, పంచాయతీలకు అడ్డాగా నంద్యాలను మార్చారని విమర్శించారు. పాదయాత్రలో నారా లోకేష్ దూకుడుగా వెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేషన్న
డాక్టర్ల సూచన మేరకు స్కానింగ్ వెళ్లిన @naralokesh Anna..#YuvaGalamPadayatra #NaraLokesh #YuvaGalamLokesh #YuvaGalam #HOPEAGMT6816 #iTDPforTDP pic.twitter.com/cz6aVJ7eHO
— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) May 18, 2023