తెలుగు నాట కొన్ని కుటుంబాలకు రాజకీయంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అతి కొద్ది కుటుంబాలకు మాత్రమే రాజకీయంగా, సినిమా పరంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో నందమూరి కుటుంబం ఒకటి. సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు. 1980లలో తెలుగు దేశం పార్టీ పెట్టారు. దాదాపు 6 నెలల్లో ప్రభంజనం సృష్టించారు. తెలుగు వారి ఆత్మగౌరవంతో తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ తదనంతరం ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీని విజయ పథంలో నడిపిస్తున్నారు. పలుమార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్నికల సమయంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పలు చోట్ల ప్రచారం పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన ప్రచార శైలిపై పలు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లోకేష్ మంత్రి అయ్యారు. అప్పుడు కూడా ప్రతి పక్ష పార్టీనుంచి తీవ్ర స్థాయిలో విమర్వలు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యారు. చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగించే నేర్పు, చాకచక్యం లోకేష్‌లో లేదన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి, విమర్శలతో లోకేష్ రాటు తేలారు. కరోనా సమయంలో అన్ని రకాలుగా రాజకీయ యుద్దానికి సిద్ధమయ్యారు.
తన శరీరాన్ని, మనసును రెండిటిని సిద్ధం చేసుకున్నారు. లోకేష్‌లో చోటుచేసుకున్న ఈ మార్పుతో అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రికి తగ్గ కుమారుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లోకేష్ 2024 ఎన్నికల కోసం అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయటానికి నిశ్చయించుకున్నారు. ఇప్పుడు చెప్పిందంతా పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి గురించే.. అతడు ఇంకెవరో కాదు.. సీనియర్ ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. మరి, వైరల్‌గా మారిన నారా లోకేష్ పాత ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Glad to present the CDP of Young, Dynamic Leader Nara Lokesh on the occasion of his birthday tomorrow. #CDPofNaraLokesh #NaraLokesh #TeluguDesamParty pic.twitter.com/TM3gAfmx2u
— Kiran Parasa (@parasakiran9) January 22, 2022