చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా తాను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నపుడు ఏపీకి వచ్చిన కంపెనీల దగ్గర లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు సామాన్య జనం పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. లోకేష్‌తో కలిసి నడుస్తూ లోకేష్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు. లోకేష్ ప్రతీ గ్రామంలోని ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి గట్టి సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో పర్యటించారు. గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తాను ఐటీ మినిష్టర్‌గా ఉన్నపుడు జిల్లాకు తీసుకువచ్చిన కంపెనీలు, సంస్థల దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు. గురువారం జోహో కంపెనీ దగ్గర సెల్ఫీ దిగారు. అనంతరం కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు లోకేష్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫొటోలను నారా లోకేష్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ వైఎస్ జగన్.. రేణిగుంట జోహోలో పని చేస్తున్న నా అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల కళ్లలో మెరుపు, ముఖంలో నవ్వు చూడు. నువ్వు ఈ నాలుగేళ్లలో తీసుకువచ్చిన ఇలాంటి ఒక నవ్వును చూపించగలవా’’ అని ప్రశ్నించారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. యువకులను ఆకర్షించటానికి, వారిని తమవైపు తిప్పుకోవటానికి ఈ పాదయాత్రను చేపట్టారు. అంతేకాదు! ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అయిందని, ఏపీకి పెట్టుబడులను తీసుకురావటంలోనూ విఫలమైందన్నది ప్రతిపక్ష పార్టీల వాదన. దీన్నే తమ అస్త్రంగా మార్చుకోవటానికి టీడీపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గతంలో తాను ఐటీ మంత్రిగా ఉన్నపుడు ఏపీకి వచ్చిన కంపెనీట వద్ద సెల్ఫీలు దిగి, వాటితో అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కంపెనీలు కానీ, పెట్టుబడులు కానీ, ఏవైనా ఉంటే చూపించండని గట్టిగా సవాల్ విసురుతున్నారు. నారా లోకేష్ చేసిన పనితో ప్రభుత్వం ఒకరకంగా ఇరుకున పడ్డట్టు అయింది.
నారా లోకేష్ సవాల్‌కు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? కౌంటర్ ఇస్తుందా? ఇస్తే ఆ కౌంటర్ ఏ విధంగా ఉండబోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం నారా లోకేష్‌కు గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చిన పెట్టుబడులు, కంపెనీల గురించి చెప్పాలి. ఏ ప్రాంతంలో ఏ కంపెనీ వచ్చింది అన్న వివరాలు వెల్లడించాలి. మరి, ప్రభుత్వం తమ హయాంలో ఏపీకి తీసుకువచ్చిన పెట్టుబడులు, కంపెనీల వివరాలను బయటపెట్టి లోకేష్‌కు కౌంటర్ ఇస్తుందా? లేక వేరే ఏవిధంగానైనా లోకేష్‌కు కౌంటర్ ఇస్తుందా?. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే. మరి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా లోకేష్ పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hey @ysjagan, look at the spark in the eyes and smile on the faces of my sisters and brothers working at @Zoho in Renigunta. Can you show one such smile that you brought in the last 4 years?#YuvaGalamPadayatra pic.twitter.com/9zmCrXQC1A
— Lokesh Nara (@naralokesh) February 23, 2023