ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. పాత, కొత్త వారికి అవకాశం కల్పిస్తూ.. మొత్తం 25 మందికి మంత్రి పదవులు కేటాయించారు. అయితే కొందరు పాత మంత్రులకు మరోసారి పదవి దక్కకపోవడం.. మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న కొత్త వారికి నిరాశ ఎదురుకావడంతో.. వారిలో కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి కేబినెట్ కూర్పు.. వైసీపీలో చిచ్చు పెట్టిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో అధికార పార్టీ ప్రస్తుత పరిస్థితిపై మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు స్పందించారు. పాపం ఆ నాయకులను చూస్తూంటే.. తనకు చాలా బాధగా ఉందంటూ.. సెటైర్లు పేల్చారు. మంత్రులకు మనవి.. నేను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: నిహారికను టార్గెట్ చేసిన వారిని కుక్కలతో పోల్చిన నాగబాబు!
‘నిన్న వైసీపీలో మంత్రి పదవులు రానివారు, మంత్రి పదవులు పోయిన వారి యొక్క ఫ్రస్ట్రేషన్, బాధ, కుమిలి పోవటం.. మరీ కొంతమంది అయితే కన్నీరు పెట్టుకోవటం చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అయ్యో పాపం అనిపించింది. కానీ ఒక్క విషయం.. కౌలు రైతుల ఆత్మహత్యలు, ఇతర ఉత్పత్తి కులాలలో చనిపోయిన ప్రజలు, ఉద్యోగ అవకాశాలు రాని యువత, రాజధాని ప్రజల కడుపు మంట, ఉద్యోగులు పడుతున్న బాధలు.. నాశనం అయిపోయిన మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాలులేక నిత్యం చస్తున్న ప్రజలు (చాంతాడంత లిస్ట్ ఉందిలెండి) వాళ్ళు పడుతున్న బాధల పట్ల కూడా ఇదే రకమైన కన్నీరు, ఫ్రస్ట్రేషన్, బాధ, కుమిలి పోవటం, వాళ్ళ పట్ల ప్రేమ లాంటివి కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది.. ఏమంటారు వైసీపీ లీడర్స్. (నేను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ)’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: సినిమాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. ఫోటోలు వైరల్!
వైసీపీలో మంత్రులకు నా మనవి. @AndhraPradeshCM@JanaSenaParty @JSPShatagniTeam#janasena https://t.co/W5k5enHNM8 pic.twitter.com/byJk7LQ33j
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 11, 2022
నాగబాబు ట్వీట్‌తో జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సీఎం జగన్‌పై నాగబాబు దారుణమైన పోస్ట్! ఆ పదం వాడటంతో!