ప్రముఖ పారిశ్రామికవేత్త, మై హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరావు రాజ్యసభకు నామినేట్ కానున్నారని తెలుస్తోంది. బీజేపీ అధినాయకత్వం త్వరలో మైహోం అధినేతను పెద్దల సభలో కూర్చోబెట్టనున్నట్లు సమాచారం. అస్సాం రాష్ట్రం నుంచి ఆయన్ను రాజ్యసభకు ఎన్నిక చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఇప్పటికే ఆయన బీజేపీకి దగ్గరైనట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న రామేశ్వర్రావు.. కొంతకాలంగా దూరమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు గట్టి ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ నుంచి ఎగువ సభకు పంపిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. యూపీ, అస్సాం, కర్ణాటక.. వీటిలో ఏదైనా ఓ రాష్ట్రం నుంచి రామేశ్వరావును రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆధ్యాత్మిక గురువు చినజీయర్ నిర్మించిన సమతామూర్తి విగ్రహా ప్రతిష్టాపనలో కీలకంగా వ్యవహరించిన రామేశ్వరావు.. ఈ విగ్రహా స్థాపన కోసం వంద ఎకరాలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.