ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మ్యాస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఆయన స్థానంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
రాజాను నేరుగా పార్టీలోకి చేర్చుకోకుండా రాజ్యసభకు పంపడం ద్వారా ఆయన అభిమానుల ఆదరణ పొందొచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో “అంబేడ్కర్-మోదీ” పుస్తకానికి ముందుమాటలో అంబేడ్కర్ ఆశయాలను మోదీ నెరవేరుస్తున్నారని ఇళయరాజా పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా నియమించనున్నారన్న వార్త చర్చనీయాంశమైంది. మరి.. ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా నియమించనున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.