నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు సొంత ప్రభుత్వంపైనే మరోసారి దుమ్మెత్తిపోశారు. వైసీపీలోనే ఉంటూ అధికార మంత్రులతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైతం విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తారు. అయితే తాజాగా మరోసారి అధికార ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు ఎత్తాడు. మంత్రులందరి నుంచీ రాజీనామాలు తీసుకున్నారని వారి ముఖాలు దిగాలుగా మారాయన్నారు.
ఇది కూడా చదవండి: మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు: నారా లోకేష్
మంత్రులందరిని మారుస్తారని అంటున్నా.. పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నానిని తప్పించరు. ఈ ముగ్గురినీ దమ్ముంటే మంత్రివర్గం నుంచి తప్పించండి అంటూ అన్నారు రఘురామ. ఇక ఒకవేళ ఆ ధైర్యం చేస్తే పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొకదప్పదని కూడా ధీమా వ్యక్తం చేశాడు. ఏపీ అంధకారంలో ఉందని, ఇది అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. కరెంటు ఇవ్వలేక పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చిందని అన్నారు. ప్రజల మనోభావాలు, వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషం వేసుకుని తిరగాలని జగన్‌కు సూచించారు. ప్రజలు అనుకునేది వింటే ఆయన గుండె ఆగి చనిపోతారన్నారని కూడా అన్నారు ఎంపీ రఘురామ రాజు. రఘురామ రాజు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.