టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఎంపీ కేశినాని నాని ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలో చంద్రబాబుకు పుష్ప గుచ్ఛం ఇవ్వాలని కేశినేనిని.. ఎంపీ గల్లా జయదేవ్ కోరాడు. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నాని నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే.. మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాబు పర్యటను ఉద్దేశిస్తూ.. కేశినేని నాని ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టులు కలకలం రేపాయి. దీనిపై ఎంపీ కార్యాలయం స్పందించింది.
చంద్రబాబు పర్యటనను ఎద్దేవా చేస్తూ.. నాని ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లతో ఆయనకు సంబంధం లేదని ఎంపీ కార్యాలయం తెలిపింది. ఎవరో ఆయన పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. తప్పుడు ట్వీట్లు చేశారని తెలిపింది. అంతేకాక దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. సోషల్ మీడియాలో తన పేరు మీదగా వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.