చాలా రోజుల తరువాత జరుగుతున్న ఏపీ శాసనసభలో ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజా తనదైన పంచ్ లతో ప్రసంగించారు. మహిళా సాధికారత పైన జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో రోజా కాస్త ఎమోషనల్ గా కూడా మాట్లాడారు.
నేను ముందు అన్నా అంటూ.. చంద్రబాబు వద్దకి వెళ్ళాను. పదేళ్ల పాటు రూపాయి తీసుకోకుండా పార్టీ కోసం పని చేశాను. కానీ.., అక్కడ నన్ను నమ్మించి గొంతు కోశారు. కానీ.., జగనన్న అలా కాదు. జగన్ ను కలిసి ఎమ్మెల్యే కావాలని ఉందని చెప్పాను. నేను అడిగాను అని రెండు సార్లు ఎమ్మెల్యేను చేశారు.కీలకమైన ఏపీఐఐసీ పదవి కేటాయించారు. నాకు ఇద్దరు అన్నయ్యలు. కానీ.., దేవుడు ఇచ్చిన అన్న మాత్రం జగనన్న అని రోజా ప్రసంగించారు.
గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వవరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీలో అమలు చేస్తున్న మహిళా సంక్షేమమే ఇందుకు నిదర్శనం అని రోజా చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో కుప్పంలో టీడీపీ ఓటమిపై వేసిన సెటైర్స్ హౌస్ లో నవ్వులు పూయించాయి. మరి.. రోజా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.