సోమవారం(మార్చి7) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరపున సంతాప తీర్మానం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డికి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా ఎమోషనల్ అయి.. కన్నీళ్లు పెట్టుకున్నారు.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ..”అందరికి ఆప్తుడైన గౌతమ్ రెడ్డి వంటి గొప్ప వ్యక్తి సంతాప తీర్మానం మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.గౌతమ్ రెడ్డి నన్ను ఎప్పుడూ సొంత చెల్లిలా చూసేవారు. ఆయనను ఏపీ ఐఐసీ ఛైర్మన్ హోదాలో నేను దగ్గర నుంచి చూశాను. మా జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రి కావడంతో నగరి నియోజకవర్గ సమస్యల గురించి ఆయనకు వివరించేదాన్ని. వెంటనే సమస్యల పరిష్కార మార్గానికి కృషి చేసేవారు. కేబినేట్ లో ఆయనను అందరు బాహుబలి అని పిలిచేవారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి క్షణాల్లో మన మధ్య నుంచి దూరం కావడం బాధగా ఉంది. అసెంబ్లీకీ వస్తే కనిపిస్తారేమో అన్నట్లు ఇప్పటికి ఉంది” అని రోజా తెలిపారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.