తెలంగాణాలో బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. నిత్యం కేసీఆర్ ప్రభుత్వం పై రాజా సింగ్ విరుచుక పడుతుంటారు. ఈయన ఏదో ఓ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. మరొకవైపు ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు కూడా పొంచి ఉంది. ఆ విషయాని గతంలో రాజాసింగ్ స్వయంగా తెలిపారు. తాజాగా మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. తనకు ఉగ్రవాదులు, ఇతర సంస్థల నుంచి ప్రాణాహాని ఉందని తెలిపారు. ఈ రోజు కాకపోయిన రేపైన తనను చంపేస్తారని అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఉగ్రవాదులు, ఇతర సంస్థల నుంచి ముప్పు పొంచి ఉంది. గతంలోనూ తనకు ప్రాణా హాని ఉందని రాజాసింగ్ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చింది. ఆయనకు ఉన్న ముప్పు ఉన్న దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నవాళ్లకు ఇలాంటి పాత వాహనాలు ఇవ్వడం సరైంది ఏ మాత్రం కాదు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రాజాసింగ్ గతంలోనే ప్రభుత్వం ప్రశ్నించారు. తాజాగా మరోసారి తనకు ఉగ్రవాదులన నుంచి ముప్పు ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. మరి.. ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.