దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంపై ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఎంపీ వీడియో నిజమో కాదో తెలియకుండా మాట్లాడకూడదని, వీడియోకి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇక ఈ విషయంలో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నార్నని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మహిళలపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని, అప్పుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థినులు వేధింపులకు గురైతే ఒక్క కేసైనా పెట్టారా అంటూ ప్రశ్నించారు.
కాగా రోజా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహిళా మంత్రిగా ఉండి.. ఎంపీని సమర్ధించేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీడియో ఫేక్ కాదని నిపుణులు చెబుతున్నా.. ఇంకా నిజం తేలలేదంటూ మాట్లాడటం ఏంటని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇన్ని రోజులైనా ఎంపీపై ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోలేదని మండిపడుతున్నారు. ఎంపీ హోదాలో ఉండి న్యూడ్ వీడియో కాల్ చేసిన గోరంట్ల మాధవ్ ను వెనకేసుకురావడం దారుణమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి గోరంట్ల మాధవ్ విషయంలో రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.