RK Roja: దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయలు ఆసక్తికరంగా ఉంటాయి. నిత్యం అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇలా అనేక విషయాల్లో ఇరుపార్టీల నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు కొనసాగుతుంటాయి. ఇటీవల 10వ తరగతి పరీక్షల ఫలితాలపై రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మరోమారు మాటల యుద్ధానికి తెరతీశాయి. ఒకరిని మించి మరొకరు సవాళ్ళతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా మంత్రి ఆర్కే రోజా లోకేష్ పై విరుచుకపడ్డారు. లోకేష్ ఈ జన్మలో అసెంబ్లీలో అడుగుపెట్టలేడు.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కొందరి నేతలతో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తనతో మహా ద్వారం ద్వారా గన్ మెన్ వెళ్లారని పచ్చ ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక ఏపీలోని రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ పై నిప్పులు చెరిగారు. 10వ తరగతి ఫలితాలపై టీడీపీ రాజకీయం చెయ్యటం దిగజారుడుతనమని రోజా విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: ఆ పసి పిల్లలపై ట్రోల్స్ ఏంటి? దమ్ము ఉంటే మాతో పోరాడండి: కొడాలి నాని!
జూమ్ మీటింగ్ లో కోడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే లోకేష్ ఎందుకు పారిపోయాడో ప్రజలకు చెప్పాలని మంత్రి రోజా ప్రశ్నించారు. ఇక జీవితంలో లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టలేరని రోజా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలైతే టీడీపీ ని మూస్తేమని అచ్చెన్నాయుడు పదే పేద చెప్తున్నారని, అందుకు వారు రెడీ అవ్వాలన్నారు రోజా. ఇదే క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడులను కూడా త్రీవ స్థాయిలో రోజా విమర్శించారు. మరి.. లోకేష్ పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.