మంత్రి ఎంటీబీ నాగరాజు చదువింది కేవలం 9వ తరగతి వరకు మాత్రమే. కానీ, ఆయన కుటుంబ ఆస్తి విలువ మాత్రం వేల కోట్లుగా ఉంది. స్థిర, చర ఆస్తులు మొత్తం కలిపి రూ.1,609 కోట్లు ఉన్నాయి.
కర్ణాటకలో అతి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నామినేషన్ల ఘట్టానికి తెరలేచింది. కీలకమైన నామినేషన్ల పర్వం సోమవారం నాడు మొదలైంది. ఈ నేపథ్యంలోనే బరిలో దిగబోయే నేతల ఆస్తుల వివరాలు వైరల్‌గా మారాయి. అఫిడవిట్‌లో వారు పేర్కొంటున్న ఆస్తుల గురించి తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజు ఆస్తి వివరాలకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన తన కుటుంబం మీద దాదాపు రూ.1,609 కోట్ల ఆస్తులున్నాయట.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య శాంతకుమారి పేరుతో రూ.536 కోట్ల చరాస్తులు, రూ.1,073 కోట్ల చరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఇద్దరికీ కలిపి 98.36 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ఇక, ఎంటీబీ నాగరాజు చదువు విషయానికొస్తే ఆయన చదివింది 9 వ తరగతి మాత్రమే. 2018 ఎన్నికల్లో హొసకోటె అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున గెలిచారు. 2018లో ఆయన ఆస్తులను రూ.1,120 కోట్లుగా ప్రకటించారు.
2019లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అందులో నాగరాజు కూడా ఉన్నారు. బీజేపీలో చేరిన తర్వాత 2020 ఉప ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో రూ.1,220 కోట్లు ఉన్నాట్లు నాగరాజు ప్రకటించారు. ఐదేళ్లలో ఎంటీబీ నాగరాజు ఆస్తుల విలువ రూ. 500 కోట్లు. మూడేళ్లలో రూ.390 కోట్ల మేర పెరిగినట్లయింది. 9వ తరగత వరకే చదువుకున్న నాగరాజుకు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. 2018తో పోల్చితే ఆయన ఆస్తులు 62 శాతం మేర పెరిగింది.