జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనే రేపింది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు, అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము విజయంగా ప్రకటించుకుంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై పెద్దిరెడ్డి ఆసక్తికర కామెంట్లు చేయగా.. మంత్రి కొడాలి నాని కూడా అదే తరహాలో స్పందించారు.
టెక్నికల్ సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మూడు రాజధానుల బిల్లు రద్దుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించనున్నట్లు తెలిపారు. మరోవైపు పెద్దిరెడ్డి ఇది కేవలం ఇంట్రవెల్ మాత్రమే అని.. సినిమా ఇంకా పూర్తి కాలేదంటూ కామెంట్ చేశారు.