ప్రస్తుతం ఏపీలో భీమ్లానాయక్ సినిమా సెలబ్రేషన్సే కాదు.. ఆ సినిమా పేరుతో రాజకీయ రగడ కూడా కొనసాగుతోంది. భీమ్లానాయక్ సినిమాను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. పవన్ సినిమాని కావాలనే తొక్కేస్తున్నారు అనే మాటలు బాగా వినిపిస్తున్న నేపథ్యంలో.. మంత్రి కొడాలి నాని ఆ విషయాలపై తనదైన శైలిలో స్పందించారు.
‘ప్రభుత్వానికి అఖండ, బంగార్రాజు సినిమాలు ఎంతో.. భీమ్లానాయక్ సినిమా కూడా అంతే. మేము ఫిబ్రవరి 25న టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇస్తాం. మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పలేదు. సినిమా టికెట్ రేట్ల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ కు- జగన్ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. వారి మధ్య ఇది యుద్ధమే అంటూ కొన్ని ఛానల్స్ ప్రసారాలు చేస్తున్నాయి. ఏమీ లేని దాన్ని ఏదో ఉంది అనేలా చేస్తున్నారు.’
‘చంద్రబాబు సీఎం అయిపోవాలని భావించే వారంతా మీ చుట్టూ చేరి మీ వెల్ విషర్స్ అన్నట్లు చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 2024లో కూడా మిమ్మల్ని పావుగా వాడుకుని సీఎం అవ్వాలని చూస్తున్నారు. కచ్చితంగా ఓడిపోతారు అని తెలిసిన ఒక 25 సీట్లు మీక ఇచ్చి.. మిమ్మల్ని మళ్లీ పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. మీరు సీఎం అవ్వాలి, మీ పార్టీ బాగుండాలి అని కోరుకునే వారిని మీ వెల్ విషర్స్ గా పెట్టుకోండి. చిరంజీవి గారిని సీఎం ఎందుకు అవమానిస్తారు? చిరంజీవి- ఆవిడ భార్యను ఇంటికి పిలిచి సీఎం దంపతులు గుమ్మదాకా వచ్చి ఆహ్వానించారు. అది మర్చిపోయారా?’ అంటూ కొడాలి నాని తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.