mekathoti sucharitha: ఏపీ నూతన క్యాబినేట్‌లో చోటు దక్కకపోవటంతో మాజీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనకు మరోసారి మంత్రి పదవి దక్కకపోవటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ పదవుల కోసం వేంపర్లాడటం మా ఇంట వంట లేదు. అలా అయితే 2009లో వైఎస్ కుటుంబం కోసం అసెంబ్లీలో తల వంచుకుని నిలబడి, రాజీనామా చేసేవాళ్లం కాదు. అప్పటి కాంగ్రెస్ ఎన్నో ప్రలోబాలకు గురి చేసింది. వాటన్నిటిని తట్టుకుని నిలబడ్డాము. బెదిరించారు, ఆశ చూపారు.. కానీ, మాకు వైస్ కుటుంబం ముఖ్యం.
ఈరోజు కూడా అంతే! పదవి ముఖ్యం కాదు.. కానీ, ప్రతి మనిషికి ఆత్మాభిమానం, ఓర్పు, సహనం అనేవి ఉంటాయి. అడుగులకు మడుగులు ఒత్తితే అలాగే కొనసాగే వాళ్లము. కష్టకాలంలో పార్టీ పెట్టేటప్పుడు లేని వారు ఇప్పుడు పార్టీ అధికారాన్ని అనుభవిస్తూ పార్టీ నడిపే స్థాయిలో ఉన్నారు. అలాంటివారి అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం. ఆత్మాభిమానం కోసం బ్రతికే వాళ్లని అవమానిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయి అని అధిష్టానం ఇప్పటికైనా తెలుసుకోవాలని మనవి’’ అని పేర్కొన్నారు. మేకతోటి సుచరిత కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. డుమ్మాకొట్టిన మాజీ మంత్రులు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.