తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్కపై ప్రశంసల వర్షం కురపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని మంచి లీడర్ అంటూ కితాబు ఇచ్చారు. ఈయన లాంటి లీడర్ గట్టి లీడర్లు తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
ఇక ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ అత్యున్నత పదవులు ఇచ్చిన సత్కరించిందని, పార్టీ స్థాపన నుంచి అతనిని మంచిగానే చూసిందంటూ తెలిపాడు. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయ కురవృద్ధుడైన జానారెడ్డినే ఓడించామని ఈటల ఓ లెక్కా అంటూ తెలిపారు మంత్రి కేటీఆర్. దీంతో రానున్న రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమ వ్యక్తం చేశారు కేటీఆర్. ఇక త్వరలో హుజరాబాద్ కు ఉప ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే.