నిన్న కొడాలి నాని, వల్లభనేని వంశీపై మధిర టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఒక్కసారిగా రాజకీయ దురమారం రేగింది. అయితే దీనిపై స్పందించారు మల్లాది వాసు. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబపై తనకు ఉన్న అభిమానంతో, వారి ఇంటి ఆడబిడ్డపై కొందరు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో కోపం వచ్చిందని, తమ కులానికి జరగుతున్న అన్యాయం చూసి బాధపడి కొన్ని వ్యాఖ్యలు చేశానని తెలిపారు.
తనకు ఏ రకమైన నేర సంస్కృతి లేదని. తనకు హత్యలు చేయించేంత సీన్ కూడా లేదని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి జరుగుతన్న అవమానాలను చూసి తట్టుకోలేక నిన్న ఆవేశంతో మాట్లాడినట్లు వాసు తెలిపారు. తన ఏవరిని ఉద్దేశించి హత్యలు చేయాలని ప్రోత్సహించే విధంగా మాట్లాడలేదని, తన మాటలను కావలనే వక్రికరించారని మల్లాది వాసు తెలిపారు. వాసు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.