గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో ఏర్పడి శివసేన అధికారం చేపట్టింది. ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా అధికారం పగ్గాలు చెపట్టారు. ఇంతకాలం సజావుగానే అధికార కూటమిని థాక్రే నడిపారు. అయితే తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార కూటమిలోని శివ సేన పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే వేరు కుంపటితో.. సంకీర్ణ ప్రభుత్వాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.. గుజరాత్ సూరత్‌లోని ఓ హోటల్‌లో ఆయన మరికొందరు ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు సుమారు 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.
థానేకు చెందిన ప్రముఖ నేతగా ప్రస్తుతం మంత్రి ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతంలో శివ సేన బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అయితే తన శాఖల్లో సీఎం ఉద్దవ్ థాక్రే, ఆయన తనయుడు టూరిజం మంత్రి అయిన ఆదిత్యా థాక్రేల జోక్యం ఎక్కువగా ఉండడంతో ఆయన రలిగిపోతున్నారని సమాచారం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నుంచి నిధుల కేటాయింపుల విషయంలోనూ షిండేతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లంతా సూరత్ హోటల్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే పరిణామాల నేపథ్యంలో సీఎం ఉద్దవ్ థాక్రే.. తనపార్టీ ఎమ్మెల్యేలందని సమావేశం పరుస్తున్నారు. మరి.. మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనే విషయంపై మరికొంత సమయం వేచి చూడాలి. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.