ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటు మరణించారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలిసి..అనేక మంది రాజకీయ, ఇతర ప్రముఖులు అపోలోకు వెళ్లి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళర్పించారు. గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతికి గురైయ్యారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని హైదరాబాద్ బయల్దేరారు.
తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నేత గౌతమ్ రెడ్డి అని జగన్ అన్నారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు ఏపీ సీఎం జగన్. రాజకీయల్లోకి రాక ముందు నుంచి కూడా జగన్ తో గౌతమ్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. గౌతమ్ తండ్రి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో దివంగత రాజశేఖరరెడ్డికి ఎంతో సాన్నిహిత్యం ఉంది.