ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతరుల మంత్రులకు కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా మంత్రులు ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను చూడనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలల్లో ఐటీ, పరిశ్రమలు, నైపుణాభివృద్ధి శాఖను మంత్రి సిదిరి అప్పలరాజుకు, లా అండ్ జస్టిస్ ను ఆదిమూలపు సురేష్ కు, జీఏడీ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్, ఎన్ఆర్ ఐ ఎంపవర్మెంట్ ను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కేబినెట్ లో కీలకంగా వ్యవహరించారు. ఆయన అకాల మరణంతో కారణంగా ఆయనకు సంబంధించిన శాఖలను ఇతర మంత్రులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయ శాఖలకు సంబంధించి పూర్తి వ్యవహారాలకు సదరు మంత్రులు పర్యవేక్షిస్తారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.