తెలుగు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది ప్రత్యేక ప్రస్థానం. ఉమ్మడి రాష్ట్రానికి.. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఐదేళ్లపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అరాచకాలు చూసి ప్రజలకు ఆ పార్టీ మీద నమ్మకం పూర్తిగా పోయింది. దాంతో.. ప్రజలు ఆ పార్టీకి ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నామంటున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జన్మభూమి కార్యకర్తలు ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో.. స్వయంగా అనుభవించిన ప్రజలు.. మరో సారి చంద్రబాబుకు అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ వివరాలు.. ప్రస్తుతం చంద్రబాబు.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఆవేదనగా తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఇవే నాకు చివరి ఎన్నికలు. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. లేదంటే ఇక మీ ఇష్టం. అంతా మీ చేతుల్లోనే ఉంది’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఇక ఇవే తనకు చివరి ఎన్నిక అంటూ చంద్రబాబుచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక వయసు రీత్యా చూసిన చంద్రబాబు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి బాబు తర్వాత.. పార్టీ బాధ్యతలు తీసుకుని.. దానికి పూర్వ వైభవం తెచ్చే వారు ఎవరా.. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు మాట్లాడారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.