తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు మునుగోడు పైనే ఉంది. మునుగోడు నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే తెరాస పార్టీ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.. బీజేపీ అభ్యర్థి మునుగోడు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ ర్యాలీలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ 18 వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని కొన్నదని ఆరోపించాడు.
మునుగోడు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. అన్ని రాజకీయ పార్టీల చూపు దీనిపైనే. వాడీ వేడి రాజకీయాలతో ఇప్పటికే నియోజకవర్గం వేడెక్కింది. తాజాగా జరిగిన నామినేషన్ ర్యాలీతో మునుగోడు పట్టణం మెుత్తం గులాబి మయం అయ్యింది. గులాబి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమ ర్యాలీకి హాజరైన మంత్రి కేటీఆర్.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..”ఇది ప్రజలపై బలవంతగా రుద్దిన ఎన్నిక.. రాజగోపాల్ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గంలో కనిపించిండా? అంటూ ప్రశ్నించాడు. ఇక ఈ ఎన్నిక మునుగోడు ఆత్మగౌరవానికి, డబ్బు, మద్యానికి, కాంట్రాక్ట్ ముఠాకి మధ్య సాగుతున్నాపోరాటంగా వర్ణించాడు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొంటానని రాజగోపాల్ రెడ్డి అంటుండు. మీ అందరికి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా.. ప్రభాకర్ రెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. మునుగోడును దత్తత తీసుకుంటాను” అని కేటీఆర్ అన్నారు. 18వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొన్నది అని ఆరోపించారు. లేకపోతే.. అంత చిన్న కంపెనికీ అంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా వచ్చిందో రాజగోపాల్ రెడ్డి చెప్పాంటూ.. ప్రశ్నించారు.