అధికార వైఎస్సార్ సీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయన ఆ ఆడియోలో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై తన దగ్గర సాక్షాలు ఉన్నాయని అన్నారు. తాను ఆ సాక్షాలు బయటపెడితే ఇద్దరు ఐఏఎస్‌ల ఉద్యోగాలు పోతాయని చెప్పారు. తాజాగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రముఖ డిజిటల్ మీడియా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్, ఆడియో లీక్, రెబల్‌గా మారటం, చంద్రబాబును కలవటం వంటి పలు విషయాలపై స్పందించారు. కోటంరెడ్డి ఆడియో వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘‘ పీఎస్‌ఆర్ ఆడియో పంపిన తర్వాతే నాకు ఆధారం దొరికింది. ఎమోషనల్‌గా బెదిరించటానికే ఆ ఆడియో నాకు పంపారు. 51 సెకన్ల ఆడియో అని వాళ్లు అంటున్నారంటే, అది మీ దగ్గర ఉన్నట్లే కదా? ’’ అని అన్నారు.
కాగా, సొంత పార్టీ వాళ్లే తన ఫోన్‌ను ట్యాప్ చేశారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. పార్టీకి ఎంతో విధేయంగా ఉన్న తన ఫోన్‌ను ట్యాప్ చేయటం బాధ కలిగించిందని అన్నారు. తాను వేరే పార్టీలో ఉండి, తన ఫోన్‌ను ట్యాప్ చేసి ఉంటే బాధపడేవాడ్ని కాదన్నారు. అయితే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పలువురు మంత్రులు, మాజీ మంత్రులు స్పందించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అన్నారు. కోటంరెడ్డి ఆప్తమిత్రుడు ఒకరు కోటంరెడ్డి ఫోన్ కాల్‌ను రికార్డ్ చేశాడని తెలిపారు. మరి, ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.