జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. జిల్లాను రణరంగంగా మార్చింది. ‘కోనసీమనే ముద్దు.. మరే పేరు వద్దు’ అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలు జుళిపిస్తే.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగారు ఆందోళనకారులు. చివరకు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఫలితంగా హింసా కాండ చేలరేగింది.
జిల్లా పేరు విషయంలో ఏపీలో చోటు చేసుకున్న సంఘటనల పట్ల మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఏదో నాయకుడి పేరు పెడితే వ్యతిరేకిస్తే.. అర్థం ఉంటుంది కానీ జాతీయ సంపద అయినటువంటి అంబేడ్కర్ పేరు పెడితే.. ఇలా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంటే భారతదేశ అస్థిత్వానికి చిహ్నం, జాతీయ సంపదగా పరిగణించే ఓ మహా నాయకుడిని కూడా కేవలం కుల దృష్టితోనే చూసే సమాజంలో బతుకుతున్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక.. ఇదే ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పటులో భాగంగా పలు జిల్లాలకు ప్రముఖ రాజకీయ నాయకులు పేర్లు పెడితే.. హర్షం వ్యక్తం చేశారు. అలాంటిది అంబేడ్కర్ లాంటి ఓ మహోన్నత వ్యక్తి పేరు జిల్లాకు పెడితే సంబరపడాలి తప్ప.. ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
NTR జిల్లా..ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొన్ని మండలాలను విడగొట్టి.. ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ గురించి ప్రతిపాదించిన ప్రారంభంలోనే పలువురు రాజకీయ నాయకులు, నేతలు కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో ఒకదానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Konaseema: భగ్గుమన్న అమలాపురం.. కారణాలు ఏంటి.. ఆందోళకారుల ఏం కోరుతున్నారు!
తెలుగువారి ఆత్మగౌరవాన్ని.. దేశ స్థాయిలో వినిపించిన ఎన్టీఆర్ పేరును జిల్లకు పెట్టడం పట్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. అందరికి ఆమోదయోగ్యమే. తమకు తిరుగులేదని విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ గర్వమనచడం కోసం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలల చాటడం కోసం నాడు ఎన్టీఆర్ తెలుగు దేశం పేరిట పార్టీ స్థాపించి.. తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి.. తెలుగు వారి గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపింపచేశారు. జిల్లాకు అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టడం అందరికి ఆమోదయోగ్యంగానే ఉంది. ఎవరు వ్యతిరేకించలేదు.
వైఎస్సార్ జిల్లా..దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించారో అందరికి తెలిసిందే. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి.. వారికి మేలు చేస్తానని మాట ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రియింబర్స్‌మెంట్, పెన్షన్‌ల పెంపు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టి.. పేదల పాటిల పెన్నిధిగా నిలిచాడు. పాలనలో తనదైన ముద్ర వేశాడు. అలాంటి గొప్ప నేత పేరు కడప జిల్లాకు పెట్టడాన్ని ఎవరు తప్పు పట్టలేదు. ఆమోదం తెలిపారు.
అంబేడ్కర్ పేరు పెడితే తప్పేంటి..
ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును డా అంబేడ్కర్ జిల్లాగా మార్చింది. అది కూడా ప్రజల విజ్ఞప్తి మేరకే. ఎందుకంటే ఓ ప్రాంతానికో, జిల్లాకో పేరు మార్చాలంటే.. అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంటే సరిపోదు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు తమకు ఆమోదమే అంటూ అంగీకారం తెలిపిన తర్వాతే పేరు మార్పు జరుగుతుంది. కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే పద్దతి అనుసరించింది. అభ్యంతరాలు తెలపమని కోరింది. మరీ అన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇలా హింసాకాండ సృష్టించడం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు.
ఇది కూడా చదవండి: Davos 2022: దావోస్ వేదికగా అరుదైన కలయిక.. నెట్టింట వైరలవుతోన్న KTR, సీఎం జగన్ ఫోటోలు!ఇక్కడ జాతీయవాదులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఒకే ఒక్క ప్రశ్న సంధిస్తున్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌లు కేవలం రాష్ట్రానికి సంబంధించిన నేతలు. వారు.. వారి అవసరాల కోసం, రాజకీయాలకు తగ్గట్టు మసులుకున్నారు. కానీ అంబేడ్కర్ వంటి మహాశయుడు వీరిలా కాదే. ఆయన యావత్ భారత ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం కృషి చేశారు. నేడు మనం అనుభవిస్తున్న ఈ హక్కులు, అధికారాలు.. ఆయన ముందు చూపు వల్ల మనకు లభించినవే. అంబేడ్కర్ అంటే కేవలం ఓ జాతికో, వర్గానికో చెందని వ్యక్తి కాదు. ఆయన యావత్ భారతీయులకు చెందిన వ్యక్తి.
ఆయన గొప్పతనం ఎలాంటిదంటే.. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాకత్మమైన కొలంబియా, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి అత్యుత్తన్నత యూనీవర్శిటీల్లో అంబేడ్కర్ విగ్రహాలు దర్శనం ఇస్తాయి. వారి దృష్టిలో ఆయనకు అంత గొప్ప స్థానం ఉంది. అంబేడ్కర్‌ని డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు. ఆయనకు 64-65 సబ్జెక్ట్స్‌లో పీహెచ్‌డీ స్థాయి నిష్ణాతత్వం ఉందనే చాలా విషయాలు మన భారతీయులకు తెలియవు. అసలు అంబేడ్కర్ వంటి మహనీయుడుకి జాతేంటి.. ఆయన జాతీయ సంపద. ఆ లెక్కన వస్తే.. ఆయన విశ్వవిఖ్యాత, మ్యాన్ ఆఫ్ ది మిలియన్‌గా నిలిచిన మహోన్నత వ్యక్తి.
ఇది కూడా చదవండి: Konaseema: నివురుగప్పిన నిప్పులా కోనసీమ.. ఇంటర్నెట్ సేవలు బంద్!కానీ విచారకరం అంశం ఏంటంటే.. అంబేడ్కర్ అనే వ్యక్తిని మనం కేవలం ఓ ఓటు బ్యాంక్‌గా చూస్తుండటం దురదృష్టకరం. అలాంటి మహోన్నత వ్యక్తి పేరు మీద ఇంత హింసాకాండ సృష్టించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేధావులు. ఈ రోజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులకు.. ఆయన గురించి ఇసుమంతైనా తెలుసా అని వాపోతున్నారు. ఇప్పటికైనా మన నాయకులు అంబేడ్కర్ వంటి మహనీయులను కేవలం ఓటు బ్యాంక్‌లో చూడటం మానేస్తి మంచిదని సూచిస్తున్నారు.
ఇక ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం అంటే అది శాంతియుత వాతావరణంలో జరగాలి. కానీ కోనసీమలో చోటు చేసుకున్న అల్లర్లను పరిశీలిస్తే.. ఏకంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా ప్రతినిధుల ఇళ్లను తగలబెట్టడం వంటి చర్యలకు పాల్పడటం చూసి విస్తుపోతున్నారు జనాలు. ఎందుకంటే ఏళ్ల పాటు పెద్ద ఎత్తున సాగిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడు ఇంలాంటి హింసా సంఘటనలు చోటు చేసుకోలేదు.. కానీ ఆంధ్రలో ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఏకంగా నాయకుల ఇళ్లను తగలబెట్టడం చూసి విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.