తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి పునఃప్రారంభంలో భాగంగా ప్రొటోకాల్ పాటించలేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: ఓ ఎమ్మెల్యే పని చేయ్.. నీకు దండం పెడతా: జేసీ ప్రభాకర్ రెడ్డి
అయితే స్థానిక భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం అందకపోవడంతో ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి పునఃప్రారంభం విషయంలో తెలంగాణ సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునఃప్రారంభానికి పిలవలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించింది. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్వీట్ చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
యాదాద్రి పునఃప్రారంభానికి @TelanganaCMO ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు.
కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించింది.
దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2022