తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మాత్రం అప్పుడే వేడెక్కింది. టీఆర్‌ఎస్ ప్లీనరీలో నేతల ప్రసంగం చూస్తే.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా అనిపించింది. ఇక ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండగానే.. పొత్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమతో పొత్తు కోసం ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. దీని గురించి అడిగితే.. మా పార్టీ అధిఫ్టానం అందుకు ఒప్పుకోలేదు’’ అని తెలిపారు. ఇక రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: అప్పుడు ఎన్టీఆర్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించి.. CM సీటు నుంచి దించేశారు: KCR
ఇక టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహణపై కూడా కోమటిరెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏం చేసిందని టీఆర్‌ఎస్ పార్టీ.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ఇంత ఆర్భాటంగా ప్లీనరి నిర్వహించిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయింది: సీఎం KCR
రేవంత్ కార్యక్రమానికి హాజరు కాను..
నల్లగొండ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం తలపెట్టిన కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని కోమటిరెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నందున వెళ్లలేకపోతున్నట్లుగా తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బలంగా ఉందని.. వేరే నేత వచ్చి.. సమీక్ష జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట సమావేశాలు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు సర్వసాధారణమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్‌తో కేసీఆర్ పొత్తుకు ప్రయత్నం చేశారన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: జాతిపిత గాంధీజీని ద్వేషించే దేశమా.. భారతదేశం?: సీఎం KCR