మంత్రి కొడాలి నాని రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలలో ఫైర్‌బ్రాండ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంచి స్థానం ఉన్న నేత, ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉన్న లీడర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని కంగారు పడకండి. దానికో లిటిగేషన్ ఉంది. ఇటివల వెలువడిన ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ ఫలితాలపై మంత్రి నాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీకి ప్రజల ఆదరణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా నంటూ సంచల నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 99 శాతం జెడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని, కుప్పంలో చంద్రబాబును కచ్చితంగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.