Kodali Nani: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని అన్నారు. ఎమ్మెల్యే పదవి పోతేనే తాను బాధపడతానని పేర్కొన్నారు. శనివారం ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే నాకు ఇష్టం. నన్ను మాజీ మంత్రి అని పిలవద్దు. మంత్రి పదవి పోతే బాధపడటానికి.. కుక్కలాగా ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే వ్యక్తులం కాదు. రాజశేఖర్‌రెడ్డిని కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయింది’’ అని అన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గతంలోనూ కొడాలి నాని మంత్రి పదవిపై ఘాటుగానే స్పందించారు. “నేను మంత్రి పదవి కోసం చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిట్టానని పిచ్చివాగుడు వాగుతున్నారు. నాకు మంత్రి పదవి అనేది వెంట్రుకతో సమానం. ఏ రోజు జగన్ చెబితే ఆరోజు నా పదవి వదిలేస్తానని రెండేళ్ల కిందటే చెప్పాను. ఇప్పుడు అదే చేశాను. జగన్ రాజీనామా చేయమన్నారు, నేను చేశాను. ఆయన చెప్పింది నేను చేశాననే సంతోషం నాకుంది” అని అన్నారు. కాగా, ఏపీ క్యాబినేట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నాని తన మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. మరి, కొడాలి నాని తాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అభివృద్ధి అంటే భూమ్ భూమ్ బీర్లు అమ్మడమా? : పవన్ కళ్యాణ్