మంగళవారం(మార్చి29)న తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ఆ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు యన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ లేదని.. ఆయనను పార్టీ నుంచి బయటకి పంపేశాడని కొడాలి నాని నిప్పులు చెరిగారు.
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. “టీడీపీలో చంద్రబాబు తీసుకొచ్చిన ఒక్క పథకమైనా ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఉందా.. అల్లుడు అని నమ్మినందుకు యన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబును ఏం అనాలో అర్థం కావడం లేదు.యన్టీఆర్ శాపం చంద్రబాబుకు తప్పకుండా తగులుతుంది. ఇప్పటికే టీడీపీ దిగజారిపోయింది. మహనుభావుడు ఎన్టీఆర్ శాపం వల్లే చంద్రబాబు కొడుకు మంగళగిరిలో ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసి.. మళ్లీ యన్టీఆర్ నామజపం చేస్తున్నారు” అని చంద్రబాబుపై కొడాలి నాని నిప్పులు చెరిగారు. మరి.. కొడాలి నాని మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.