మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. మునుగోడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వీటన్నింటి కన్నా ఎక్కువగా ఓ అంశంపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. మునుగోడు సభలో పాల్గొనడం కోసం వచ్చిన అమిత్ షా.. అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. సుమారు అర్ధగంటకు పైగానే వీరి భేటీ కొనసాగింది. అమిత్ షా-బాద్‌షా మీటింగ్ అటు దేశ రాజకీయాల్లోను.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ హీట్ పెంచింది. ఈ భేటీ వెనక రాజకీయ కారణాలు ఏమై ఉంటాయా అంటూ ఇప్పటికో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం ట్రిపుల్ ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటన నచ్చడంతోనే.. ప్రత్యేకంగా భేటీ అయి అభినందించినట్లు చెబుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా అమిత్‌షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీపై వైసీపీ నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ, అమిత్ షా ఉపయోగం లేకపోతే ఎవరితోనూ నిమిషం కూడా మాట్లాడరు. అలాంటిది తారక్‌తో భేటీ అయ్యారంటే.. తన మద్దతుతో బీజేపీని బలపర్చుకోవాడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. అంతేకాక పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. చంద్రబాబుతో ప్రయోజనం లేకనే మోదీ, అమిత్ షా ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు’ అన్నారు. నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.