టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులతో ఎన్నికలకు వెళ్లనున్నాయని అందరూ అనుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిస్తే.. అధికారం ఖాయం అన్న చర్చ రాజకీయవర్గాల్లో గట్టిగా నడుస్తోంది. అయితే, ఈ పొత్తులను అడ్డుకోవటానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంట. ఇందుకోసం బలంగా పావులు కదుపుతున్నారంట.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించటం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితులు తర్వాత ఉండవు. నాయకుల మూడ్‌ను బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి. నిన్నమొన్నటి వరకు టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్లనున్నాయని అందరూ అనుకుంటున్న విషయమే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఇక, అధికారికంగా పొత్తులను ప్రకటించటమే తరువాయి’ అనుకుంటున్న సమయంలో ఓ కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బీఆర్‌ఎస్ అధినేత గట్టిగా ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు.. ఓ ప్రముఖ మీడియా అధినేత ఓ కథనాన్ని ప్రచురించారు. ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఎందుకు దృష్టి సారిస్తున్నారు? పవన్‌కు ఇచ్చిన ఆఫర్? తదితర విషయాల గురించి రాసుకొచ్చారు. సదరు ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ‘‘ ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం లేదు. టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారు.
సీఎం జగన్‌కు సహాయపడటానికి ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయపరంగా చంద్రబాబు అంటే గిట్టని కేసీఆర్.. బాబును అధికారంలోకి రాకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకే తన బీఆర్‌ఎస్ పార్టీలో కాపులకు స్థానం కల్పించి.. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారు. జనసేన-టీడీపీ పొత్తును కూడా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.పవన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఓ 30 స్థానాలు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పవన్‌కు నచ్చజెబుతున్నారు. చంద్రబాబు, పవన్ విడిపోవటం వల్ల జగన్ అధికారంలోకి వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు.
పవన్‌ను ఎలాగైనా తన వైపు తిప్పుకుని జగన్‌కు మేలు చేసే ప్రయత్నంలో పడ్డారు. అలాకాకపోతే.. టీడీపీ-జనసేన పొత్తులతో వెళ్లాలనుకుంటే.. పవన్ సీఎం పదవి అడగాలని అంటున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తన దూతలతో పవన్‌పై ఒత్తిడి తెస్తున్నారు’’ . ఇక, ఈ కథనంపై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, పవన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారన్న ప్రముఖ మీడియా కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) February 19, 2023