ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే కేంద్రం ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి సీఎం కేసీఆర్ కూడా చేరారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించడానికే కేంద్రం కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రమోట్ చేస్తుందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ థియేటర్లో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు!
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే కశ్మీర్ ఫైల్స్ సినిమాను రిలీజ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ కల్పించడం ఎంతో అవసరం. రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలి. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళన చేపడదాం. మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందింది. తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోంది. విభజన చట్టంలోని హామీలను మోదీ సర్కార్ అమలు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 24, 25 తేదీల్లో ఆందోళనలు చేపడతాం. రాష్ట్రంలోని రైతులందరని కలుపుకొని ఉద్యమం చేస్తాం. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. అంతా కలిసి పోరాటం చేయాలి. 28న యాదాద్రికి అందరూ రావాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఈటెలకు లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఎందుకోసమంటే!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.