తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఢిల్లీలో అవమానం జరిగిందా అంటే అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోలు అంశంపై ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ప్రయాణంలో అవేశంతో వెళ్లిన కేసీఆర్ ప్రధానితో పాటు పలువురి కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దక్కలేదు. కళ్లు కాయలు కాసేలా నాలుగు రోజుల పాటు వేచి చూసిన ఫలితం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో తెలంగాణ మంత్రులు బీజేపీ తీరుపై విరుచుకుపడుతున్నారు.
కావాలనే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరుణంలో ఇంకా పుంజుకోవాలని చూస్తోంది. గతంలో కేసీఆర్ ఢిల్లీకి వచ్చిన వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వడంతో తెలంగాణలోని ఓ వర్గం ప్రజలు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి అనుమానాకు చెక్ పెట్టేందుకే ఢిల్లీ పెద్దలు ఈసారి సీఎం కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి ఓ కారణమని తలలు పండిన మేధావులు చర్చించుకుంటున్నారు.
ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఢిల్లీ బీజేపీ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ నేతలు ఇది ఘోర అవమానంగా భావిస్తున్నారు. ఇక ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ నాలుగు రాజుల పాటు వేచి చూసి బుధవారం తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. మరీ నిజంగానే కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంలో ఏదైన దాగి ఉందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక కేసీఆర్ కు బీజేపీ నేతల నుంచి అపాయింట్ రాకపోవడంపై ఏదైన దాగి ఉందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.