కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్నిచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 13న వెలువడుతాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
కర్ణాటకలో ఈరోజు(మే 10) అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 13న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. పలుచోట్ల చిన్న చిన్న ఘర్షణలు మినహా.. ఎన్నికలు ప్రశాంతంగానే సాగాయి. ఎన్నికల విషయంలో అన్నీ పార్టీలు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ప్రధాని మోదీ విస్తృత ప్రచారాలపై నమ్మకం పెట్టుకుంది. మరోవైపు ప్రియాంక గాంధీ చేసిన ప్రచారాలు తమకు పట్టం కడతాయని కాంగ్రెస్ నాయకులు నమ్ముతున్నారు. పైగా 38 ఏళ్ల నుంచి కర్ణాటక ప్రజలు వరుసగా రెండోసారి అధికారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు గనుక బీజేపీ అధికారం దక్కించుకుంటే చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. అయితే కన్నడిగుల నాడి ఎలా ఉంది? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఎగ్జిట్ పోల్స్ దృష్ట్యా చూసుకుంటే కర్ణాటకలో హంగ్ తప్పదని తెలుస్తోంది. ఏ పార్టీకి కూడా పూర్తి ఆధిపత్యం దక్కదని చెబుతున్నారు. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. భారత్ వర్ష్- పోల్ స్టార్ట్ సర్వే ప్రకారం.. బీజేపీ పార్టీకి 85 నుంచి 100 సీట్ల వరకు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమికి 94 నుంచి 108 సీట్లు లభిస్తాయి. జేడీఎస్ పార్టీకి 24 నుంచి 32 సీట్లు దక్కచ్చు. స్వతంత్రులు 2 నుంచి 4 సీట్లు దక్కించుకోవచ్చని చెబుతున్నారు. రిపబ్లిక్ టీవీ- పీ మార్క్ సర్వే ప్రకారం.. బీజేపీ పార్టీకి 88 నుంచి 98 సీట్ల వరకు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమి 99 నుంచి 109 సీట్లు దక్కించుకోవచ్చు. జేడీఎస్ పార్టీ 21 నుంచి 26 సీట్లు దక్కిచుకునే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు 0 నుంచి 4 సీట్లు పొందచ్చు.
జీ న్యూస్ మ్యాట్రైజ్ ఏజెన్సీ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 103 నుంచి 118 సీట్ల వరకు గెలుపొందవచ్చు. బీజీపీ 79 నుంచి 94 సీట్లు దక్కించుకోవచ్చు. జేడీఎస్ 25 నుంచి 33 సీట్లు దక్కచ్చు. స్వతంత్రులు 2 నుంచి 5 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇవి కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మాత్రం జేడీఎస్ పార్టీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. కర్ణాటకలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
3 Exit Polls Predict Hung Assembly In Karnataka With Slight Edge For Congress https://t.co/4HzQqvDQ1A pic.twitter.com/lc0rLz5JJs
— NDTV News feed (@ndtvfeed) May 10, 2023