కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్, గాలి జనార్ధన్‌రెడ్డిని పోలుస్తూ.. విమర్శలు చేస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు మండి పడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. అధికారం చేజిక్కించుకోవాలని భావించిన బీజేపీ, కింగ్ మేకర్‌గా నిలవాలని ఉవ్విళూరిన జేడీఎస్ పార్టీలు రెండు ఎన్నికల బరిలో వెనకబడ్డాయి. అయితే ఈ కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక ఎన్నికలకు 6 నెలల ముందు వరకు బీజేపీలో ముఖ్య నేతగా ఉండి.. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన గాలి జనార్ధన్ రెడ్డికి కాషాయ పార్టీ మొండి చేయి చూపింది. దాంతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి జానర్థన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి.. ఎన్నికల బరిలో నిలిచాడు. ఆయన పార్టీ విజయం సాధించకపోయినా.. గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. గాలి జనార్ధన్ రెడ్డి విజయం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. చాలా మంది గాలి జనార్ధన్‌రెడ్డిని, పవన్ కళ్యాణ్‌ను పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే గాలి జనార్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కానీ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి.. పదేళ్లు అవుతున్నా.. కనీసం తానైనా ఎమ్మెల్యేగా గెలవలేదని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ పోలికను రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఆర్థిక నేరస్తుడైన గాలి జనార్ధన్ రెడ్డితో.. పవన్ కళ్యాణ్‌ను పోల్చడం సరి కాదు అంటున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆయన మీద ఎన్నో ఆర్థికపరమైన ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు కర్ణాటకలో బీజేపీ గెలుపుకు గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన సోదరులు బళ్లారి శ్రీరాములు శక్తి వంచన లేకుండా శ్రమించారు. పార్టీ గెలుపుకు ఆర్థికపరమైన తోడ్పాటుతో పాటు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. అయితే పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టడంతో.. డిసెంబర్‌లో బీజేపీ నుంచి బయటకు వచ్చాడు.
ఆ తర్వాత తానే స్వయంగా కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) పెట్టి బీజేపీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చాడు గాలి జనార్ధన్ రెడ్డి. కోప్పళ జిల్లాలోని గంగావతి నుంచి.. ఫుట్ బాల్ సింబల్ మీద పోటీ చేసిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి 8 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి కొత్త పార్టీ తరపున అనేక నియోజక వర్గాల్లో చాలా మంది పోటీ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి.
ఈ క్రమంలో కొందరు రాజకీయ నాయకులు, విశ్లేషకులు.. గాలి జనార్ధన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్‌ను పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ స్థాపించి కేవలం ఆరు నెలల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.. కానీ పవన్ కళ్యాణ్ పదేళ్ల క్రిత పార్టీ స్థాపించాడు. ఇప్పటి వరకు ఒక్కసారి గెలవలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతవరకు తన పార్టీని, కానీ నేతలను కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేదు అంటూ విమర్శిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోలికను కొందరు రాజకీయ నాయకులు, జనసేన నేతలు కార్యకర్తలు తప్పు పడుతున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరగాడితో పవన్ కళ్యాణ్‌ని పోల్చడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ కేసులో అక్రమాలకు పాల్పడి.. భారీ ఎత్తున అక్రమాస్తులు ఆర్జించాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. పార్టీ పెట్టిన ఆరు నెలల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడంటే.. అందుకు కారణం డబ్బు. ఎమ్మెల్యేగా గెలవడం కోసం గాలి జనార్ధన్ రెడ్డి ఏ రేంజ్‌లో డబ్బులు ఖర్చు చేసి ఉంటాడో అందరికి తెలుసు. మరి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. సినిమాల మీద వచ్చే ఆదాయాన్ని పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఖర్చు చేస్తున్నాడు. సాయం కోసం తన దగ్గరకు వచ్చే వారిని ఆదుకుంటూ మానవత్వం చూపుతున్నారు. మనసున్న మంచి నేతగా ఆయన జనాల్లో ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. ఆయన సంపాదన, పార్టీకి వచ్చే విరాళాలతోనే ముందుకు సాగుతున్నాడు. గాలి జనార్ధన్ రెడ్డి మాదిరిగా ఆయనకు భారీ ఆస్తులు లేవు. కానీ నిజాయతీపరుడు, మానవతావాదిగా, మనసున్న నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక నేటి రాజకీయాల్లో గెలుపు ఓటములను నిర్ణయించేది డబ్బు. ఎవరు ఒప్పుకున్న.. ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఆ డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నది అన్నదే ఇక్కడ ముఖ్యం. ఇక్కడ గాలి జనార్ధన్ రెడ్డి దగ్గర ఆక్రమార్జన ద్వారా వచ్చిన డబ్బు ఉంది.. విచ్చల విడిగా ఖర్చు చేశాడు.. గెలిచాడు. మరి పవన్ కళ్యాణ్.. నేటికి కూడా సినిమాలు చేస్తూ.. ఆ వచ్చిన డబ్బులను పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారు. సరే ఈ పదేళ్లల్లో ఆయన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో, తన అజెండాను ప్రచారం చేసుకోవడంలో వెనకబడ్డారు అంటే.. సమంజసమే కానీ. వ్యక్తిగతంగా చూసుకుంటే.. గాలి జనార్ధన్ రెడ్డి కన్నా పవన్ కళ్యాణ్ ఎంతో ఉన్నతంగా ఉన్నారు. ఇలాంటి పోలిక కూడా తప్పు అంటున్నారు జనాలు.