కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి. గతం సంవత్సరం రిసార్ట్‌ల చుట్టూ పెద్ద హైడ్రామా నడించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం ప్రారంభం అయింది. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 122కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అధికార బీజేపీ పార్టీ 66 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. బీడీఎస్ 30 స్థానాల్లో ముందంజలో ఉంది. సాయంత్రానికంతా ఫలితాలకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఓ భయం వెంటాడుతోంది. గతం తాలూకూ అనుభవాలు పట్టి పీడుస్తున్నాయి. 2019 కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. జేడీఎస్ సహాయంతో కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, అనుకోని విధంగా 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటంతో సంక్షోభం నెలకొంది.
మిగిలిన తమ పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకోవటానికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రిసార్ట్ రాజకీయాలకు తెరతీశాయి. రిసార్ట్ రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. అయినప్పటికి కాంగ్రెస్, జేడీఎస్‌కు ఎదురు దెబ్బ తగలింది. తర్వాతి కాలంలో బీజేపీ మెజార్టీని నిరూపించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికి కాంగ్రెస్ పార్టీ గతం తాలూకూ అనుభవాలు భయపెడుతున్నాయి. అందుకే మరో సారి రిసార్ట్ రాజకీయాలకు తెర తీయబోతోందని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు చేసేంతవరకు గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించి రక్షించుకోవటానికి చూస్తోంది. ఇందుకోసం పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ సహాయం తీసుకోవాలని భావిస్తోందట.
హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఉంచి తమ ఎమ్మెల్యేలను భద్రంగా చూసుకోవాలని అనుకుంటోందట. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయం తీసుకోనుందట. బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు.. జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించేందుకు కేసీఆర్ సైతం ఇందుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో తల దాచుకునేందుకు కేసీఆర్ సహాయం చేసే అవకాశం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు! కర్ణాటకకు చెందిన వ్యక్తులు హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటల్స్‌లో రూములు బుక్ చేసినట్లు సమాచారం. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్‌లో 20, నోవాటెల్ హోటల్ లో 20 రూమ్‌లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. మరి, ఈ ప్రచారాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. మరి, కర్ణాటక రిసార్ట్ రాజకీయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.