ఎన్నికల వేళ కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నేతలు ఇచ్చే హామీలు చూస్తే.. భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి హామీలు కూడా ఇస్తారా అనిపించకమానదు. కొందరు నేతలు ఏకంగా యువతకు వివాహాలు కూడా చేస్తామని హామీ ఇచ్చేస్తున్నారు. ఇంతకు ఎక్కడ అంటే..
ఎన్నికల వేళ అభ్యర్థులు ప్రజల మీద కురిపించే హామీలకు ఆకాశమే హద్దు అన్నట్లు ఉంటుంది. ఇక తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆఖరికి ఇంటింటికి పాలు కూడా ఉచితంగా సరఫరా చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఇక తాజాగా కొందరు అభ్యర్థులు ఇచ్చిన హామీలు చూస్తే.. వార్ని అనిపించక మానదు. కొందరు అభ్యర్థులు.. తమను గెలిపిస్తే.. ఇల్లు, ఉద్యోగాలు, డబ్బులు మాత్రమే కాక.. ఏకంగా పెళ్లి కాని యువతకు వివాహాలు కూడా చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల హామీలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
కర్ణాటక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తోన్న ఇద్దరు అన్నదమ్ములు.. వినూత్న హామీలు ప్రకటించారు. తమను గెలిపిస్తే.. యువతకు పెళ్లిళ్ల పథకం అమలు చేసి.. వారికి వివాహాలు జరిపిస్తామని విన్నవించారు. ప్రధాన పార్టీల హామీల కన్నా కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇచ్చిన హామీలు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. గురుపుత్ర కెంపన్న కుల్లూరు, పుండలీక కుల్లూరు అనే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. కర్ణాటకలోని ఆరభావి, గోకాక్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వీరు.. ఓటర్లకు ప్రత్యేక హామీలిచ్చారు.
ఇవే కాక మరికొన్ని హామీలను సైతం ప్రకటించారయి. ఇక కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ బీపీఎల్ కుటుంబాలకు ఏడాది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, రోజు అరలీటర్ నందిని పాలు, నెలవారి రేషన్ సరుకులతో పాటు ప్రతి కుటుంబానికి 5 కిలోల సిరి ధ్యాన్యాలు ఇస్తామని ప్రకటించింది.