ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ అలియాస్ కిలారి ఆనంద్ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజాశాంతి పార్టీ స్థాపించి.. 2019లో ఏపీలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొన్నాళ్ల పాటు మీడియా ముందు పాల్ కనపడలేదు. అయితే.. కేఏ పాల్ ఇటీవల తెలంగాణ రాజకీయల్లో చురుగ్గా ఉన్నారు. నిత్యం కేసీఆర్ పాలనపై, కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. దేశానికి ప్రత్యామ్నాయం తానే అంటూ ఈ సారి తెలంగాణలోనూ పోటీకి సిద్దమని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత సీఎం వైఎస్సార్ పేరును ప్రస్తావిస్తూ.. కేఏ పాల్ అనూహ్య కామెంట్స్ చేశారు.
రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుపడు కేఏ పాల్ పై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో పాల్ ని వై.ఎస్. బాగా ఇబ్బది పెట్టారంటూ కొందరు విమర్శించారు. అప్పట్లో సోదరుడి డేవిడ్ హత్య కేసులో పాల్ ని అరెస్టు చేయడం జరిగింది. అయితే.., కొందరు తనను కావాలని ఈ కేసులో ఇరికించారని పరోక్షంగా వైఎస్ ను ఉద్దేశించి అప్పట్లో కేఏ పాల్ విమర్శలు చేశారు కూడా. అలా.. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పాల్ స్థాయి పూర్తిగా పడిపోయింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేఏ పాల్ గతంలో రాజశేర్ రెడ్డికి తనకు మధ్య జరిగిన కొన్ని విషయాలను తెలిపారు.
ఇదీ చదవండి: నేరం ఒప్పుకున్న వైసీపీ MLC అనంతబాబు! హత్యకి కారణం?“నేను క్రైస్తవ బోధకుడు, శాంతిదూత, రాజకీయకుడిగానే కాకుండా చాలా అంశాల్లో ప్రపంచంలో నేనే నంబర్ వన్ అయ్యాను. ఈ రోజుకు కూడా ప్రపంచదేశాల అధినేతలు నన్ను కలవడం కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు సీఎంలుగా, మాజీ సీఎంలుగా ఉన్న వాళ్లు ఒకప్పుడు నా అశ్సీసుల కోసం గంటల తరబడి ఎదురు చూశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా నాకు అనుబంధం ఉంది. కొన్ని విషయాల్లో ఆయనను విమర్శించినందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. అందులో భాగంగా ఒకప్పుడు సోనియాగాంధీ.. 56 మంది నేతలను తన వద్దకు రాకుండా అడ్డుకున్నారు.
నా కార్యక్రమాలకు అనుమతి ఇస్తే.. కాంగ్రెస్ భూస్థాపితమవుతుందని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో సోనియాగాంధీకి లేఖలు రాశారు. అయితే వైఎస్ నన్ను నాశనం చేయాలని చూశాడు..కానీ ఆయన భూస్థాపితమైపోయాడు” అని కేఏ పాల్ ఇంటర్య్వూలో తెలిపారు. పాల్ చేసిన ఈ వ్యాఖ్యలతో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అభిమానులు కేఏ పాల్ పై మండిపడుతున్నారు. మరి.. పాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.