సోమవారం తనపై జరిగిన దాడికి సంబంధించి ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరుతున్నారు. నాపై దాడి జరిగిన రోజు తెలంగాణలో చీకటి రోజని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: కాంగ్రెస్‌కు షాక్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ!
ఇక ఈ ఘటనపై కేఏపాల్ డీజీపీకి ఫిర్యాదు చేసే క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనపై జరిగిన దాడి ఘటనపై కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటిస్తానని, దమ్ముంటే ఆపాలంటూ కేఏపాల్ సవాల్ విసిరారు . కేసీఆర్, కేటీఆర్ పై కేఏపాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.