Jeevitha Rajasekhar: వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీపై ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నాకు మహిళల కష్టాలు తెలుసు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తోందో అందరికీ తెలిసిందే. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తాను. పార్టీ కార్యక్రమాలకు విధిగా హాజరవుతాను.
బండి సంజయ్‌కి మద్దతు తెలపటానికి పాదయాత్రలో పాల్గొన్నా. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా. సంజయ్ ఎంతో సమర్థవంతమైన నాయకుడు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని కాపాడగలరని నమ్మి బీజేపీలో చేరా’’ అని చెప్పుకొచ్చారు. మరి, తెలంగాణ ఎన్నికల్లో పోటీపై జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సర్కారీ కొలువులు సాధించిన రైతు బిడ్డ!